![]() |
![]() |
.webp)
ఒక వేయి కాదు రెండు వేలు కాదు లక్ష రూపాయలు లేనివాళ్ళకోసమిచ్చాడు పల్లవి ప్రశాంత్. దీని గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నలుగురికి సాయం చేయడం కోసం పల్లవి ప్రశాంత్ తో పాటు ఆట సందీప్, భోలే షావలి, శివాజీ ముందుకొచ్చారు. ఓ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. వారికి సంవత్సరానికి సరిపడా రైస్, ఫుడ్ అన్నీ చూసుకుంటున్నానని చెప్పినట్టుగా ఆట సందీప్ చెప్పుకొచ్చాడు . ఇలా ఇంకా లేనివారికి సాయం చేస్తూనే ఉంటానని మరిన్ని వీడియోలు చేస్తానని.. ప్రాణం పోయిన మాట తప్పను అని పల్లవి ప్రశాంత్ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రైతు మాట ఇచ్చాడంటే చేసి చూపిస్తాడురా అని అంటున్నారు. సెల్యుట్ టూ ప్రశాంత్ అని ఒకరు, ఇది సామాన్యుడి విజయమని మరొకరు ఇలా ఇన్ స్టాగ్రామ్ మొత్తం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు పల్లవి ప్రశాంత్. ఇది కదా రైతు కథ.. ఇదే కదా రైతు కల.. సామాన్యుడిగా మొదలైన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రయాణం.. ఎంతోమంది రైతులకి స్పూర్తినిచ్చింది. ఎక్కడో పొలంలో పనిచేసుకునే రైతు.. ఓ సెలెబ్రిటీ హోదాని దక్కించుకున్నాడు. ఓ ఇరవై మంది సెలబ్రిటీలున్న రియాలిటీ షోలో వారందరిని కాదని గెలుపుని సొంతం చేసుకున్న రైతుబిడ్డగా చరిత్ర సృష్ణించాడు పల్లవి ప్రశాంత్.
బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి చివరి వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ తగ్గేదేలే అన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూశారు. అయితే హౌస్ లోని ప్రతీ ఆటలో వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి తనేంటో నిరూపించుకున్నాడు ప్రశాంత్. చివరివరకు తగ్గేదేలా అంటు రెచ్చిపోయాడు. సెలెబ్రిటీలందరిని దాటేసి రైతుబిడ్డ సత్తా చాటుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి వెళ్ళనంతవరకు ఎంతోమంది ఎగతాళి చేశారు. వారందరికి తన గెలుపుతో సమాధానం చెప్పాడు.
![]() |
![]() |